Telugu poetry
ఒడ్డు మీద ఉన్న పడవకి అలలు తెలీదు,
గడప దాటని మనిషికి కళలు తెలీదు,
కానీ తెలుసు అనే అపోహ..
సముద్రం లోతు ఎంతో ఒక అంచనా,
మనిషి ఆలోచనలకి ఒక కంచె,
రెండూ కంటికి కనిపించని ఊహ…
మునగడానికి భయపడే పడవ ప్రయాణం తీరం మధ్య,
కష్టాలికి భయపడే మనిషి జీవనం గోడల మధ్య,
చివరికి కలలే మినహా...
=================
ఒక పగిలిన కాఫీ కప్,
ఒక విరిగిన మనసు…
ఒక నలిగిన ఉత్తరం,
ఒక చెదిరిన గతం…
ఒక చిరిగిన పుస్తకం,
ఒక చరిగిన చరిత్ర…
ఒక జరిగిన జీవితకాలం,
ఒక తీపి జ్ఞ్యాపకం
======================